హిమాయత్ నగర్: వెంగల్ రావు నగర్ లో పోలింగ్ బూతులను పరిశీలించిన బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావు నగర్ లో జరుగుతున్న పోలింగ్ బూతులను బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బిజెపి వారిపై దాడికి పాల్పడుతున్నారని బిజెపి వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది కరెక్ట్ కాదని ఓటర్లంతా ముందుకు వచ్చి అర్హులకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాలామంది ప్రజలు తర్వాత ఓటు వేద్దాంలే అని అనుకుంటున్నారని కానీ అందరూ వచ్చి అర్హులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.