కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్ర పై విధించిన సస్పెన్షన్ ను వైసీపీ అధిష్టానం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో ఏడాది క్రితం జయం ఫణీంద్రను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ జయం ఫణీంద్ర పై సస్పెన్షన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడంతో జయం ఫణీంద్ర సంతోషం వ్యక్తం చేశారు.