సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు చేస్తున్న ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష, నభూతోనభవిష్యత్ మాదిరి నిర్వహించాలని ఆదేశాలు
సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృంధం అధికారులను ఆదేశించింది.బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి,కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్,గొట్టిపాటి రవికుమార్ లతో కూడిన మంత్రుల బృందం సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు,సంబందిత శాఖల అధికారులతో సమావేశమై సమగ్రంగా చర్చించారు.ఈ ఫెస్టివల్ ద్వారా సూర్యలంక బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.