మేడ్చల్: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, పీర్జాదిగూడ పరిధిలోని ఆరవడివిజన్ సర్వేనెంబర్ 1999 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం ఉద్ధృతకు దారితీసింది. ఒక ఇంటిని జెసిబి తో కూల్చివేయబోగా, తమ ఇంటి నీకు పుల్చవద్దని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమ ఇంటిని కూల్చివేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పేదలపైనే అధికారుల ప్రతాపమని, తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు.