కామారెడ్డి: పట్టణంలో వర్ష బీభత్సంతో నష్టపోయిన విద్యార్థులను అదుకున్న ఎబివిపి నాయకులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. ఆ వర్ష మరియు వరద బీభత్సంలో నష్టపోయిన విద్యార్థులకు నోటు పుస్తకాలను పెన్నులను ఇతర సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. వరద బీభత్సంలో నష్టపోయిన విద్యార్థులకు సామాగ్రిని పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు