మంత్రాలయం: పత్తి పంటలకు సోకే ఎర్ర తెగుళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రాలయం వ్యవసాయ అధికారి
మంత్రాలయం:పత్తి పంటలకు సోకే ఎర్ర తెగుళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రాలయం వ్యవసాయ అధికారి జీరా గణేష్ తెలిపారు. అధిక వర్షాల కారణంగా భూమిలో తేమ ఎక్కువై పత్తిపంటలకు ఎర్ర తెగులు సోకుతాయని, పొటాషియం నైట్రేట్ పిచికారి చేస్తే సమస్య తగ్గుతుందని చెప్పారు. బుధవారం ఆయన మండలంలోని మాధవరం, రచ్చుమరి గ్రామాల్లో పత్తిపంటలను పరిశీలించారు.