జహీరాబాద్: పట్టణంలో బీహార్ వాసి అదృశ్యం, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటన లో తెలిపారు. బీహార్ రాష్ట్రం లోని మోతే గ్రామానికి చెందిన అస్లం అన్సారి అనే వ్యక్తి భరత్ నగర్ లో నివసిస్తూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగించే వాడన్నారు. ఈనెల 14న రాత్రి ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదని తెలిసిన వారి వద్ద బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాలేదని, అతని భార్య తమన్న మంగళవారం సాయంత్రం వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.