అరకులోయలో 19న జరిగే మహా ధర్నా విజయవంతానికి గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు మరియు జీవో నెం.51 రద్దు కోసం ఈ నెల 19న అరకులోయలో జరిగే మహా ధర్నాలో ఆదివాసీలు పాల్గొనాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం అరకులోయ మండలంలోని బస్కిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బస్ కి సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టుతో మన ప్రాంతాలు జలసమాధి అవుతాయని, ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహాధర్నాలో పాల్గొని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.