ఆందోల్: హోంగార్డుల సంక్షేమానికి భరోసా:సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
హోంగార్డుల సంక్షేమానికి భరోసా కల్పిస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. శాలరీ అకౌంట్ ఉన్న హోంగార్డు మరణిస్తే రూ.40 లక్షల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.