మనుబోలు కమ్మలపూడి రైల్వే స్టేషన్ మధ్య శనివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ఎస్సై హరిచంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో వస్తున్నా రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడని తెలిపారు. మృతుని వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని.. సిమెంట్ రంగు గల ఆఫ్ హ్యాండ్ టీషర్ట్ ధరించి ఉన్నాడని ఆమె తెలిపారు.