కందుకూరు పట్టణంలోని బలరామయ్య తోట ఏరియాలో కొంత కాలంగా డ్రైనేజ్ పొంగి మురుగు నీరు రోడ్డుపైకి వస్తోంది. స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో స్వయంగా గృహస్థులే కాలువ శుభ్రపరుచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.