సర్వేపల్లి: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు, మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు.. అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా, జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు. అధైర్య పడద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.