ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పీవీర్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా 87 వేల కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.