కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం భద్రం పల్లె గ్రామంలో బుధవారం రామాలయం గంగమ్మ ఆలయ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతోనే ఆధ్యాత్మిక భక్తి భావం పెరుగుతుందన్నారు దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.