ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన ప్రాంతానికి చేరుకొని సకాలంలో అతడిని రక్షించారు. కనిగిరి కి చెందిన వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా స్థానికులు డయల్ 112 కు సమాచారం అందించారు. దీంతో వెంటనే సీఐ సుబ్బారావు ఆ వ్యక్తిని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చారు.