రాజేంద్రనగర్: పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మీర్పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్ నాయక్ వివరాలిలా.. అక్షిత్ రెడ్డి (21), రాజారాం (21) అల్మాస్గూడ నుంచి మీర్పేట్ వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. గాయపడిన వారిని డీఆర్డీవో హాస్పిటల్కు తరలించగా, వైద్యులు అక్షిత్రెడ్డి మరణించినట్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు