యర్రగొండపాలెం: స్థానికవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మోటార్ బైక్, తీవ్రంగా గాయపడిన కిన్నెర సునీల్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం స్థానికవరం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైకు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కిన్నెర సునీల్ అనే యువకుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చీకట్లో లారీ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుందని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన కిన్నెర సునీల్ ను దోర్నాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.