సంగారెడ్డి: నిజాం, బీజేపీ ఒకే విధానాలు: సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు
గతంలో నిజాం అనుసరించిన విధానాలని బీజేపీ అనుసరిస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. సంగారెడ్డిలోని ఓ గార్డెన్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల కోసం పేదల నుంచి భూములను బలవంతంగా తీసుకుంటుందని విమర్శించారు. ఆనాటి పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎనాడు పాల్గొనలేదని చెప్పారు