కరీంనగర్: తన తెలుగు రైటింగ్ చూసి ఒకప్పటి TGPSC చైర్మన్ గంట చక్రపాణి సారు అభినందించారు :
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
హ్యాండ్ రైటింగ్ అందరికీ జీవితంలో చాలా ముఖ్యమని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. హ్యాండ్ రైటింగ్ అంటే మైండ్ రైటింగ్ అని మేధస్సుకు పదును పెడుతుందన్నారు. మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. బుధవారం రాత్రి 9గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇటీవల పారమిత విద్యాసంస్థల సహకారంతో జరిగిన జిల్లా స్థాయి చేతివ్రాత పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అధికారులు ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైటింగ్ ను మెరుగుపరచుకోవాలన్నారు.