విజయవాడ వాంబే కాలనీలో త్రాగునీరు సమస్యలు పరిష్కరించండి: సిపిఎం బాబురావు
విజయవాడ వాంబే కాలనీలోని త్రాగునీరు సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు పేర్కొన్నారు. విజయవాడ వాంబే కాలనీ 60 డివిజన్లో జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్లు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. త్రాగునీరు పైపులు డ్యామేజ్ కావడంతో డ్రైనేజీ వాటర్ కలుషితం అవుతుందని అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని బాబురావు డిమాండ్ చేశారు.