అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 35 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ తోపుదుర్తి గ్రామంలో రెండు కోట్ల 75 లక్షల రూపాయల నిధులతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ 33/ 11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామని ఈ ప్రాంత రైతులు ప్రజలు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య లేకుండా పరిష్కరించేందుకే ఈ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.