అదిలాబాద్ అర్బన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున బీజేపీ: ఆదిలాబాద్ లో జరిగిన సెమినార్ లో సీపీఎం రాష్ట్ర నేత రవి కుమార్
వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఆవగింజంత చరిత్ర లేని త్యాగం చేయని బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ ప్రపంచం గుర్తించదగిన వర్గ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మతాల మధ్య జరిగిన కొట్లాటగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరించి విమోచన పేరుతో రాద్ధాంతం చేస్తుందని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా సిఐటియు కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సెమినార్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎర్రజెండా కు పుట్టిన వీరతెలంగాణ సాయుధ పోరాట బిడ్డన, తనబిడ్డగా సంకెనెత్తుకొని ఉరేగుతుందన్నారు