తాడిపత్రి: ప్రతి శుక్రవారం అందరూ డ్రైడేను పాటించాలి: నిట్టూరులో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్
ప్రతి శుక్రవారం అందరూ తప్పకుండా డ్రై డే ను పాటించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ అన్నారు. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో బుధవారం సీజనల్ వ్యాధుల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. డ్రమ్ములు, నీటి పాత్రలలో ఎక్కువ రోజులు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ మందులను పిచ్చికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు, సాయి సుమంత్ రెడ్డి పాల్గొన్నారు.