రైల్లో నుంచి పడి మహిళ మృతి
- మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించిన సూళ్లూరుపేట రైల్వే పోలీసులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తి - యల్లక్రు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని మహిళా మృతదేహం మంగళవారం లభ్యమయింది. మహిళ మృతదేహాన్ని డ్యూటీ కీమాన్ జెతేందర్ సింగ్ గుర్తించారు. ఈ సమాచారాన్ని ఆర్ పి ఎస్ ఐ చెన్నకేశవ కు తెలియజేశారు. వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణిస్తున్న రైల్లో నుండి పడి మహిళ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు వైద్యశాలకు తరలించారు.