ఆందోల్: చెర్ల రాయిపల్లి గ్రామంలో బాలిక అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయికోడ్ పోలీసులు
కూలిపనికి వచ్చిన బాలిక అదృశ్యం అయిన సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం చెర్ల రాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది, స్థానిక ఎస్సై చైతన్య కిరణ్ వివరాలను వెల్లడిస్తూ కర్నూల్ జిల్లా దేవన కొండ మండలం కోటకొండ(పి) గ్రామానికి చెందిన తెలుగు సుంకన్న(ముదిరాజ్) కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు, కూలీపనిలో భాగంగా రాయికోడ్ మండలం చెర్ల రాయిపల్లి గ్రామానికి చెందిన బయమ్మోళ్ల రాములు పొలంలో పత్తి ని తీయడానికి నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి టెంట్ వేసుకుని నివసిస్తున్నారు,రోజులాగే ఆదివారం కూడా పొలంలో పత్తి ని తీసి వచ్చి రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి కనిపించలేదు.