మడకశిరలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు.
మడకశిర పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సేవా పక్షోత్సవాల ఇన్చార్జి డాక్టర్ కె ఆర్ వి గుప్తా,రాయలసీమ కిసాన్ మోర్చా నాయకులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.