శ్రీకాకుళం: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలను వినియోగించుకోవాలన్న కోటబొమ్మాళి పశువైద్య శాఖ సహాయసంచాలకులు చందక నరసింహులు
రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలను వినియోగించుకోవాలని పశువైద్య శాఖ సహాయసంచాలకులు చందక నరసింహులు అన్నారు. బుధవారం కోటబొమ్మాళిలోని చౌదరికొత్తూరులో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రతి పశువుకు వేయాలని సూచించారు. హరిచంద్రపురం, బడ్డిపేట, దంత, వెంకన్నపేట, చలమయ్య పేట గ్రామాలలో గాలికుంటువ్యాధి నివారణ టీకాలు వేశారు. డాక్టర్ ఎల్. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.