పులివెందుల: చెరువుకంపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో క్యాంపర్ బోల్తా, పదిమంది కూలీలకు గాయాలు, ఒక్కరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Pulivendla, YSR | Sep 17, 2025 బొలెరో క్యాంపర్ బోల్తా పడి పదిమంది యూపీ కూలీలు గాయపడ్డారు. అందులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలంలోని చెరువుకంపల్లి వద్ద జరిగింది. గాయపడ్డ క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అజయ్ అనే కూలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషయమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి గండి కొవ్వూరు, కుమారకాల్వ గ్రామాల మధ్య సిఆర్ కంపెనీకి చెందిన బ్రిడ్జి పనుల కోసం వచ్చారు.