ప్రకాశం జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులను ప్రోత్స హించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అన్నారు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైనఅన్ని సౌకర్యాలను కల్పిస్తా మని ఆయన చెప్పారు.జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతు లకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు కల్పిస్తా మని ఆయన చెప్పారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతు ల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన చెప్పారు.