ఆందోల్: చౌటకూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
చౌటకూర్ మండలంలో భూమి వివాదం కారణంగా రైతు దూడ మల్లేశం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న 2.37 గుంటల భూమిలో కెనాల్ కాల్వకు 7 గుంటలు పోగా, మిగిలిన 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, పర్వత్ విజయ భాస్కర్ రెడ్డి, పర్వత్ విష్ణువర్ధన్ రెడ్డి, పర్వత్ అన్వేష్ రెడ్డిలు వేధిస్తున్నారని రైతు ఆరోపించారు. ఒప్పంద పత్రాలు లేవని రెవెన్యూ అధికారులు చెప్పడంతో న్యాయం చేయాలని వేడుకుంటూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.