పటాన్చెరు: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి, భర్తకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మిడిదొడ్డి మండలం పెద్ద చేపల వద్ద జరిగిన యాక్సిడెంట్ లో ప్రణతి (24 ) చనిపోయింది. మూడు నెలల క్రితం కామరెడ్డి జిల్లా బిచ్కుంద వాసి సాయికిరణ్‌తో సిద్దిపేటకు చెందిన ప్రణీతి పెళ్లయింది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇస్నాపూర్‌లో ఉంటున్నారు సిద్ధిపేటలో ఫంక్షన్‌కు వెళ్లి వచ్చి బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ వెనకనుంచి ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. భర్త గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.