ఉరవకొండ: కూడేరు మండల విద్యాశాఖ కార్యాలయం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు
అనంతపురం జిల్లా కూడేరు మండల విద్యా శాఖ కార్యాలయం నందు మండల స్థాయి చెకుముకి పోటీలు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగాయి. పోటీలను మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ గౌస్ ప్రారంభించారు విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే దిశగా ఈ పోటీలు ఉంటాయని అన్నారు కార్యక్రమం మొదటి బహుమతి కూడేరు ఉన్నత పాఠశాల ద్వితీయ బహుమతి కేజీబీవీ స్కూల్ మూడవ స్థానంలో కరట్లపల్లి ఉన్నత పాఠశాల నిలిచాయి కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.