కొండపి: సింగరాయకొండ లో వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో సోమవారం ఓ వృద్ధురాలు మెడలో నుంచి ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి మూడు సవర్ల బంగారాన్ని చోరీ చేసి తీసుకువెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు వద్ద నుంచి దొంగల వివరాలను సేకరించిన పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు పరిశీలించారు. కొంతవరకు సమాచారం గుర్తించామని తొందర్లో దొంగలను పట్టుకుంటామని సీఐ మీడియాకు మంగళవారం తెలిపారు.