ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక ఎస్సై సుధాకర్ శనివారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట అడుతుల వారి వద్ద నుంచి రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని మండల ప్రజలను ఎస్ఐ సుధాకర్ తీవ్రంగా హెచ్చరించారు.