నారాయణపేట్: విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి జాతీయ విద్యా విధానం వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆజాద్ జయంతి గురించి ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి సిలబస్ ఇప్పటివరకు ఎంతవరకు పూర్తి అయిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.