శ్రీ సత్యసాయి బాబా శతజయంతోత్సవాల సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులతో కలసి సోమవారం పరిశీలించారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి వై- జంక్షన్, బైపాస్ రోడ్డు, వెస్ట్ గేట్, కమ్మవారిపల్లి రోడ్డు పనులు, విద్యుత్ లైన్లు, వీదిలైట్లు, చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పుడా చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ నరసింహమూర్తి పరిశీలించారు.