కొత్తపల్లి, తుడిచెర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు,హాజరైనరాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియంవెంకటేశ్వర్లు యాదవ్
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ పార్వతి సమేత తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు, అలాగే జూపాడుబంగ్లా మండలంలోని తుడిచెర్ల గ్రామంలోని శ్రీ శంకర మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కొత్తపల్లిలో శ్రీ తాండవం మల్లేశ్వర స్వామి పల్లకి సేవలు వైభవంగా నిర్వహించారు, ఒకవైపు జ్వాలతోరణం వెలుగుల మధ్య శివ నామస్మరణములతో స్వామి అమ్మవాలను పల్లకిలో కొలువుంచి భక్తిశ్రద్ధలతో ఊరేగించారు, తుడిచెర్ల గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత శంకర మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు పె