వికారాబాద్: బుధవారం కొత్తగాడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పులుమద్ధికీ చెందిన శ్రీనివాస్ అనే రైల్వే హోంగార్డు మృతి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి కనకదుర్గ దాబా ముందు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే హోంగార్డు శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన జరిగింది. మండల పరిధిలోని పులమద్ది గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి రైల్వే హోంగార్డ్ గా విధులు నిర్వహించి తిరిగి ఇంటికి ప్రయాణమైన సంఘటనలో కొత్తగాడి వద్ద అదుపుతప్పి జారి పడటంతో వెనకనుంచి వస్తున్న డీసీఎం ఒకసారిగా మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.