పటాన్చెరు: 2 కోట్ల 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బొమ్మన కుంట, వడక్పల్లి పరిధిలో రెండు కోట్ల 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేశారు. మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.