. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో కొత్తగా రూ.92.5 కోట్లతో అదనపు తరగతి గదులను వివిధ పాఠశాలలకు మంజూరు చేశామన్నారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభమవుతాయి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేశామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని, సమగ్ర అంశాలతో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు, బూట్లు ఇస్తున్నామన్నారు.