హిమాయత్ నగర్: తెలంగాణ ఉద్యమం అప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉండేవారో చెప్పాలి: తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్
నాంపల్లిలోని గాంధీభవన్ లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పై మండిపడ్డారు. మైక్ ఉంది కదా అని కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉండేవారో చెప్పాలని అలాగే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఎందుకు అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఏర్పాటు అయిన ఒక పార్టీ పేరు మార్చడం వెనుక కారణం ఏంటో చెప్పాలని అన్నారు.