పల్నాడు జిల్లా, జూలకల్లులో వైసీపీ నాయకుడిపై దాడి
పల్నాడు జిల్లా,పిడుగురాళ్ల,జూలకల్లు గ్రామంలో టీడీపీ,వైసీపీ శ్రేణులు మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం రాత్రి జూలకల్లు గ్రామానికి చెందిన చల్లా అంజిరెడ్డి అనే వైసీపీ నాయకుడిపై సాగర్ కెనాల్ వద్ద కళ్ళలో కారం చల్లి ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.ఈ దాడిలో అంజిరెడ్డి రెండు కాళ్లు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.జూలకల్లు గ్రామంలో వైసిపి నాయకులె టార్గెట్ గా వరుస దాడులతో భయానక వాతావరణం సృష్టిస్తున్న టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.