నారా లోకేష్ పర్యటన సమయంలో జరిగిన ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని అలగాయపాలెం గ్రామానికి చెందిన మహిళలు గురువారం లోకేష్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఒంగోలు రిమ్స్ చికిత్స పొంది ఇంటికి చేరిన బాధితులను బుర్రా బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు.