ఖమ్మం అర్బన్: కమ్యూనిస్టుల త్యాగాలతోనే తెలంగాణ విలీనం సి.పి.ఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు
కమ్యూనిస్టుల త్యాగాలతోనే భారతదేశంలో తెలంగాణా విలీనమైందని ఇందులో మరో అభిప్రాయానికి తావులేదని సి.పి.ఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట చరిత్రను, కమ్యూనిస్టుల త్యాగాలను వక్రీకరిస్తే జాతి క్షమించదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ ముగింపుసభ ఖమ్మం లోని జెడ్పీ మీటింగ్ హాల్లో జరిగింది.