రాష్ట్రంలో మొట్టమొదటిగా చిత్తూరు డిపో నుంచి డీజల్ బస్సును సిఎన్జి గా మార్పు చేశాం డి పి టి ఓ రాము
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు టు డిపోలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజిల్ బస్సు ను CNG బస్సు గా మార్చినట్లు DPTO రాము తెలిపారు. థింక్ గ్యాస్ అనే సంస్థ ద్వారా బస్సును మార్పు చేశామన్నారు. ఇందులో 11.2 కిలో బరువు గల 8 సిలిండర్లు అమర్చగా, ఒక కిలో గ్యాస్ 5 కి.మీ. మైలేజ్ ఇస్తుందన్నారు. ఏడాది పాటు ట్రయల్ రన్ గా చిత్తూరు వేలూరు మార్గంలో ఈ బస్సును నడుపుతు న్నామన్నారు అనంతరం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు సద్వినియోగంపై వివరించారు