కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో లో బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి బైక్ పై వస్తూ డివైడర్ను ఢీకొని కిందపడిపోయిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికుల సమాచారంతో కృష్ణలంక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.