కనిగిరి: గోకులం షెడ్లను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి నియోజకవర్గం లోని పామూరు మండలం కోడిగుంపల, పెదచెర్లోపల్లి మండలంలోని బుడ్డారెడ్డిపల్లి, కనిగిరి మండలంలోని తాళ్లూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న గోకులం షెడ్లకు గురువారం ఎమ్మెల్యే ఉగ్ర సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కనిగిరి నియోజకవర్గంలో రూ .6.28 కోట్ల వ్యయంతో 314 గోకులం షెడ్లను కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. గోకులం షెడ్లను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే సూచించారు.