పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామంలో రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ షెడ్ పథకానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ షెడ్ పనులను ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాటర్ షెడ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాల ను పెంపొందించవచ్చు అన్నారు. భూమిలో నీటిని ఇంకింప చేయడం ద్వారా, భూగర్భ జలాలను పెంచడంతోపాటు, పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అన్నారు. రైతులకు ప్రయోజన కారిగా ఉంటుందన్నారు. అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.