పూతలపట్టు: చిత్తూరు పట్టణంలో తవణం పల్లెకు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
మరేడుపల్లి గ్రామం, తవణంపల్లి మండలానికి చెందిన నాగరాజన్ కుమారుడు దేవరాజులు (వయసు 40, ఎస్సీ) చిత్తూరు పట్టణంలోని క్యాంఫర్డ్ స్కూల్ ఎదుట గంగన్నపల్లిలో తన పరిచయస్తురాలు పి. ఉమ ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. గత 9 ఏళ్లుగా వీరు అక్కడ కలిసి నివసిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఆయన మృతదేహం గుర్తించి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆయన మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు.