ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి స్వామి నిర్వహించారు. రూ. 55 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అడిగిన వెంటనే విడుదల చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని పేదల ప్రభుత్వమని మంత్రి కొనియాడారు. చేసిన మేలుని లబ్ధిదారులు గుర్తుంచుకొని కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.